Monday, December 19, 2011

హైదరాబాద్ పుస్తక ప్రదర్సన

హైదరాబాద్  పుస్తక ప్రదర్సన  ప్రారంభమైంది.శనివారం సాయంత్రం నేను  నా శ్రీమతి చూడడానికి వెళ్ళాము. 
        మంచి పున్తకాలు చాలా వున్నాయి.మహమ్మద్ ఖదీర్ బాబు వ్రాసిన 
దర్గా మిట్ట కథలు ,మునిమాణిక్యం గారి కాంతం కథలు కొన్నాము. నామిని సుబ్రహ్మణ్యం గారి కథలకోసం ,సం. వె. రమేష్ ప్రళయకావేరి కథలకోసం చూసాను.దొరకలేదు 


             వాటితోపాటు పాత సినిమా పాటల instrumental సిడిలు దొరికాయి.7 సిడిల సెట్ ౩౦౦కి ఇచ్చ్హారు.చాలా బాగున్నాయి.

Thursday, August 26, 2010

మా వూరు

నా పేరు మల్లారెడ్డి.వృత్తి వ్యవసాయం.చదువు బి యస్ సి .
             నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం.బహుశా నేను పుట్టినది  పెరిగినది పల్లెటూరులో    అయినందువల్లనేమో . మా వూరు చాలా బాగుంటుంది.ప్రకాశం జిల్లాలో ఉన్నప్పటికీ కొనసీమలోలాగా ఊరినిండా  కొబ్బరి చెట్లతో చల్లగాలులతో ప్రశాంతంగా వుంటుంది.ఎంత మడువేసవిలోనైనా మధ్యాన్నానికి చల్లగా అవుతుంది,దీనికి కారణం మావూరు సముద్రం ఒడ్డన ఉండటమే.ఉదయం వేళలో కొంత ఉక్కపోత మాత్రం తప్పనిసరి.
              వూరి చుట్టూ పచ్చటి పంటపొలాలు ,వూర్లో కొబ్బరిచెట్లు ,తూర్పువైపు వేరుసెనగ పొలాలు ,ఉదయం వేళలో వేరుశనగ పొలాల్లో పనిచేసే స్ప్రిన్క్లర్స్  నాకైతే  చూడటానికి రెండు  కళ్ళు చాలవు.
                 పల్లెటూరంటే చాలామంది సరైన వసతులు వుండవు అనుకుంటారు కానీ మావుర్లో హైస్కూల్,బ్యాంకు ,ఉదయం ఐదు గంటలనుండి రాత్రి పది వరకు బస్సు సౌకర్యం వున్నాయి.